రామయ్య వస్తావయ్యా పాటకు రస్సెల్ స్టెప్పులు.. షారుక్ ఏమన్నాడంటే..?

రామయ్య వస్తావయ్యా పాటకు రస్సెల్ స్టెప్పులు.. షారుక్ ఏమన్నాడంటే..?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం జవాన్. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రామయ్య వస్తావయ్యా సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత పాటే అయినా అనిరుద్ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మ్యూజిక్ అదరగొట్టేసాడు. మిలియన్ కొద్ది వ్యూస్ అందుకుంటున్న ఈ పాటకు తాజాగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా కాలు కదిపాడు.   

వెస్టిండీస్ లో ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా క్వాలిఫయర్స్ 1మ్యాచులో  గయానా అమెజాన్ వారియర్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ విజయం సాధించింది. రస్సెల్ ప్రస్తుతం ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా.. ఈ గెలుపు అనంతరం రామయ్య వస్తావయ్యా పాటకు చిందులేశాడు. రస్సెల్ డ్యాన్స్ చూసిన షారుక్ స్పందించాడు. "ఆదివారం మీరు కప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు డ్యాన్స్ నేర్పిస్తాను. మీరందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు" అని ట్వీట్ చేసాడు.

 
కాగా.. రస్సెల్ ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతన్న సంగతి తెలిసిందే. షారుక్, రస్సెల్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. రస్సెల్ డ్యాన్స్ వేయడానికి ఇదే ప్రధాన కారణం.