హైదరాబాదీలకు అలర్ట్.. ఇవాళ (మార్చి 21) అనిరుధ్ మ్యూజిక్ కన్సర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్

హైదరాబాదీలకు అలర్ట్.. ఇవాళ (మార్చి 21) అనిరుధ్ మ్యూజిక్ కన్సర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్

గచ్చిబౌలి, వెలుగు:  గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 21 రాక్​స్టార్ అనిరుధ్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు విధించారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు ఐఐఐటీ జంక్షన్, విప్రో, గౌలిదొడ్డి, నల్లగండ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

అలాగే గోపన్ పల్లి తండా, క్యూసిటీ, కోకాపేట్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వచ్చే వారు విప్రో జంక్షన్, నానక్​రాంగూడ రోటరీ, ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలికి చేరుకోవాలి. ఇక లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను హెచ్​సీయూ డిపో, మజీద్​బండ, బొటానికల్ గార్డెన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తున్నారు.