V6 News

కళావాహన, ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలకు అంకురార్పణ

కళావాహన, ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలకు అంకురార్పణ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళావాహన, ఆలయ జీర్ణోద్దరణ వేడుకలకు శనివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. మేళతాళాల మధ్య అర్చకులు గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకువచ్చి యాగశాలకు తరలివెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.351కోట్లతో రామాలయం అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించగా, ఆలయంలోని దేవతామూర్తులను రంగనాయకుల గుట్టపైకి తరలించేందుకు కళావాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 1960-–64లో జీర్ణోద్ధరణ పనులు జరిగాయి.

త్రిదండి చినజీయర్​ స్వామీజీ పర్యవేక్షణలో యాదగిరిగుట్ట, ధర్మపురి, సింహాచలం నుంచి వచ్చిన 30 మంది రుత్విక్కులతో పాటు భద్రాచలం ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఏకకాలంలో 15 చిన్న ఆలయాల్లోని 72 దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఆదివారం రామాలయంలో మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.