
- డాక్టర్స్‌డే రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం
నవాబుపేట, వెలుగు: నేషనల్ డాక్టర్స్ డే రోజు మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట పీహెచ్సీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఏఎన్ఎం గుండెపోటుతో కన్నుమూసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన కృష్ణవేణి(35) మండలంలోని రుద్రారం సబ్సెంటర్లో ఔట్ సోర్సింగ్‌లో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓపీ విభాగంలో రోగులకు వైద్య సేవలు అందిస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే క్యాబిన్లో ఉన్న డాక్టర్ నరేశ్ చంద్ర వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతూ అక్కడే కుప్పకూలిపోయింది.
వెంటనే డాక్టర్, సిబ్బంది సీపీఆర్ చేశారు. అప్పటికే పల్స్రేట్ పూర్తిగా పడిపోవడంతో అంబులెన్స్‌లో ఎస్వీఎస్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, కృష్ణవేణి అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మధ్యాహ్నం పీహెచ్సీ సిబ్బంది అంతా కలిసి డాక్టర్స్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామని, తమ కండ్ల ముందే ఏఎన్ఎం కృష్ణవేణి చనిపోవడం కలచివేసిందని డాక్టర్ నరేశ్‌చంద్ర తెలిపారు. పై అధికారులతో మాట్లాడి మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన చెప్పారు.డ