పాక్‎కు గూఢచర్యం కేసులో మరొకరు అరెస్ట్

పాక్‎కు గూఢచర్యం కేసులో మరొకరు అరెస్ట్

గువాహటి/న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 26 ఏండ్ల హిలాల్ అహ్మద్‌ అనే వ్యక్తిని అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడు ఆలో టౌన్‎లో నివసిస్తూ.. పాకిస్తాన్‌‎కు ఇక్కడి సమాచారాన్ని అందిస్తున్నాడని గుర్తించారు. అయితే, ఈ ప్రాంతంలో భద్రతా దళాల  సమాచారాన్ని సేకరించి పంపినందుకు మొదట నజీర్ అహ్మద్ మాలిక్‌ అనే వ్యక్తిని నవంబర్ 22న అరెస్టు చేశారు.

 అతడు జమ్మూ కాశ్మీర్‌ కుప్వారాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత రెండో నిందితుడు, కుప్వారా నివాసి అయిన సబీర్ అహ్మద్ మీర్‌ను అరుణాచల్ రాజధాని ఈటానగర్‎లో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‎కు చెందిన ఈ ముగ్గురూ అరుణాచల్ ప్రదేశ్‌లో మకాం వేయడంతో.. ఈ ప్రాంతంలో దేశ వ్యతిరేక శక్తులను ప్రేరేపించడానికి  కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నారు.