వాషింగ్ మెషీన్ పేలి మంటలు.. మధురానగర్ శ్రీకృష్ణానగర్లో ఘటన..

వాషింగ్ మెషీన్ పేలి మంటలు.. మధురానగర్ శ్రీకృష్ణానగర్లో ఘటన..

జూబ్లీహిల్స్, వెలుగు: సిటీలో మరో వాషింగ్ మెషీన్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్ జైన్ మందిర్ సమీపంలో సయ్యద్ గౌస్ ఇంట్లో సాంబశివరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది.శనివారం ఉదయం ఎప్పటిలాగే వాషింగ్ మెషీన్​లో బట్టలు వేసి స్విచ్చాన్ చేశారు. కొద్దిసేపటికే భారీ శబ్దంతో మెషీన్ పేలి మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.