చిలీ: 38 మందితో వెళ్తున్న విమానం ఆచూకి లేకుండా పోయింది. చిలీ దేశ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఫ్లైట్ భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు అదృశ్యమైంది. సీ-130 హెర్క్యూల్స్ ట్రాన్స్‌పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు విమానం మిస్సైందని తెలిపారు ఎయిర్ పోర్ట్ అధికారులు.
పుంటా ఏరినాస్ నగరం నుంచి టేకాఫ్ తీసుకున్న తర్వాత అది ఆచూకీలేదు. విమానంలో 17 మంది సిబ్బంది, 21 మంది ప్రయాణికులు ఉన్నారు. మిస్సైన విమానం గురించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అంటార్కిటికా వెళ్తున్నరూట్లో విమానం కనిపించకుండాపోయిందని ఆ దేశ ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటన చేసింది.

