
శ్యామ్ సింగరాయ్, టక్ జగదీష్ ఆవరేజ్ హిట్ల తర్వాత నేచురల్ స్టార్ నాని బిగ్ హిట్ కొట్టేందుకు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న అంటే..సుందరానికీ! ట్రైలర్ రిలీజైంది. 2 నిమిషాల 40 సెకన్ల ఈ ట్రైలర్..ఆకట్టుకునే విధంగా ఉంది. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా అదరగొట్టారని చెప్పొచ్చు. సప్త సముద్రాలు దాటి ఆమెరికాలో అడుగుపెట్టిన సుందర్.. అక్కడ లీలా థామస్‌ను ఎలా మీటయ్యాడు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. వీరిద్దరి పెళ్లికి రెండు ఫ్యామిలీలను ఎలా ఒప్పించారనేది స్టోరీ. పల్లెటూరిలో పెరిగిన బ్రాహ్మణ యువకుడికి.. ఫారిన్లో పెరిగిన క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. నాని,నజ్రీయాతో పాటు నరేష్, నదియా, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
బ్రోచేవారేవరురా, మెంటల్ మదిలో'వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాతో హిట్టు కొట్టేందుకు సిద్దమయ్యాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళంలో 'ఆదదే సుందర', మలయాళంలో 'ఆహా సుందర' పేర్లతో విడుదల చేయనున్నారు.
అంటే సుందరానికీ సినిమా తర్వాత నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి దసరా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నానికి జోడిగా మరోసారి కీర్తి సురేష్ నటిస్తోంది. దసరా మూవీని తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో ఉన్న నాని లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది.