అంటే.. సుందరానికీ! ట్రైలర్ తేదీ ఖరారు

అంటే.. సుందరానికీ! ట్రైలర్ తేదీ ఖరారు

నేచురల్ స్టార్ నాని నెక్ట్స్ మూవీ అంటే.. సుందరానికీ !. ఈ మూవీ జూన్ 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ట్రైలర్ గ్లింప్స్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యే రోజును నిర్మాతలు ప్రకటించారు. ట్రైలర్ గ్లింప్స్లో యాక్టర్స్ అందరు గందరగోళంగా కనిపిస్తుంటారు. గ్లింప్స్లో నాని, నజ్రియా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా చూస్తుంటారు. ఇతర నటీనటులు నరేష్, నదియా, రోహిణి గందరగోళంగా కనిపిస్తున్నారు. వరకు హర్షవర్థన్తో హోటల్లో నాని కూర్చుంటారు. అయితే హర్షవర్ధన్..అవతల నాకు చాలా పని ఉంది త్వరగా చెప్పు అనేసరికి..ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ పడిపోతుంది. చివర్లో నాని, నజ్రియా అవును అని కన్ఫర్మేషన్ ఇస్తారు. మొత్తంగా ట్రైలర్ గ్లింప్స్తో అంటే.. సుందరానికీ  సినిమా కొత్తగా ఉండబోతుందన్న సంకేతాలిచ్చారు దర్శక, నిర్మాతలు. అంతేకాదు సినిమా వినోదాత్మకంగా ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. ట్రైలర్ గ్లింప్స్ తో  ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. 

అంటే.. సుందరానికీ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్కు హై రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.