బరువు పెరిగిన అనుష్క.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

బరువు పెరిగిన అనుష్క.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

బాహుబలి, రుద్రమదేవి, అరుంధతి లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అలరించిన అనుష్క శెట్టి... రీసెంట్ డేస్ లో సినిమాల్లో కనిపించడం లేదు. చాలా రోజులుగా కెమెరాకు దూరంగా ఉన్న స్వీటీ.. ఇటీవల బెంగళూరులోని మహా శివరాత్రికి తన తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలపై పలువురు ఆమెను బాడీ షేమింగ్ చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో బరువు పెరిగి అనుష్క పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. సైజ్ జీరో చిత్రం కోసం ఆమె బరువు పెరగడమే ఈ సమస్యకు కారణమని కొందరు అంటుండగా.. మరికొందరేమో  ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే ఆమె బరువు తగ్గలేకపోతుందని కామెంట్ చేస్తున్నారు.