వీడియో: ఏపీలో వైన్ షాపుల ముందు ఎలా ఉందంటే..

వీడియో: ఏపీలో వైన్ షాపుల ముందు ఎలా ఉందంటే..

లిక్కర్ షాపులకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక లేకుండా సడలింపులిచ్చిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రిచడం కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయితే ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కొన్నికొన్ని సడలింపులు ఇస్తున్నారు. ఏపీలో కూడా అలాగే ఆలోచించి కొన్ని సడలింపులు ఇచ్చారు. ఇప్పటికే నిత్యావసరాల సరుకుల షాపులకు సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా లిక్కర్ షాపులక కూడా కొన్ని షరతులతో సడలింపు ఇచ్చింది. మధ్యం షాపులను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరవాలని సూచించింది. అంతేకాకుండా మధ్యం ధరలను కూడా పెంచింది.

వైన్ షాపులను ఇన్ని రోజుల తర్వాత తెరిస్తే ప్రజలు ఎక్కువగా వస్తారనే ఇంగితజ్ఞానం ప్రభుత్వానికి లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. ఇన్ని మధ్యం దొరకలేదు కాబట్టి.. ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటే బాగుండేదని ఆయన అన్నారు. వైన్ షాపులు తెరవడంతో జనాలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఎగబడ్డారని ఆయన అన్నారు. ఇలా అయితే కరోనా మరింత విస్తరించే ప్రమాదముందని ఆయన అన్నారు. కొన్ని షాపుల వద్ద గుమిగూడిన జనాలను చూసి ఆయన షాక్ అయినట్లు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. వైన్ షాపు ముందు కిలోమీటర్ల మేర జనాలు క్యూలో నిల్చోవడం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఆ వీడియో ట్విట్టర్ లో పోస్టు చేశారు. అది చూస్తేనే అర్థమవుతుంది జనాలు మందు కోసం ఎంతగా తపిస్తున్నారో అని.