V6 News

 జర్మనీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

 జర్మనీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు:  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఏపీ విద్యార్థి.. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిలై మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహన్ రెడ్డి(23).. 2017లో MS చేసేందుకు జర్మనీ వెళ్లాడు. అక్కడి డస్‌బర్గ్-ఈస్సెన్ వర్సిటీలో చేరాడు. ఈ ఏడాదితో కోర్సు కూడా ముగిసిపోనుంది. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన తండ్రి గోవిందరెడడ్డికి ఫోన్ చేసి బాధపడ్డాడు. తీవ్ర ఒత్తిడికి గురైన మొహన్ రెడ్డి.. బుధవారం తాను నివసిస్తున్న బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

AP student commits suicide in Germany