ముషీరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాను ఈ నెల 11న ముషీరాబాద్ ఐటీఐలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ బి. రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు అప్రెంటిస్ల ఎంపిక చేపట్టనున్నాయి.
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో పాస్ అయిన ఐటీఐ విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ముషీరాబాద్ ఐటీఐలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరుకావాలని సూచించారు.
