APSRTC ఎండీ సురేంద్ర బాబు బదిలీ

APSRTC ఎండీ సురేంద్ర బాబు బదిలీ

అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. సురేంద్ర బాబు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్తులు జారీ చేసింది ప్రభుత్వం. చేనేత, జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్‌ కూడా బదిలీ అయ్యారు. ఆయన సాధారణ పరిపాలన శాఖ రిపోర్టు చేయాలని ఆదేశించింది . చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా సీఎం కార్యాలయ కార్యదర్శి జె.మురళికీ అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.