హైదరాబాద్ సిటీ, వెలుగు: హరేకృష్ణ మూవ్ మెంట్ – హైదరాబాద్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్‌కు అరబిందో ఫార్మా లిమిటెడ్దాతృత్వ సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ. 2 కోట్ల విరాళాన్ని అందజేసింది.
అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ఎండీ, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి చెక్కును హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వైస్ ప్రెసిడెంట్ కౌంతేయ దాస ప్రభూజీకి అందజేశారు.
అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్లు నిత్యానంద రెడ్డి, పి. శరత్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు, సమగ్ర సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అరబిందో తరఫున విరాళం అందజేసినట్టు తెలిపారు.
