నిజామాబాద్ నగర శివారులో అరణ్య ఎకో పార్క్ రెడీ...ఇవాళ (జూన్ 18) వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం

నిజామాబాద్ నగర శివారులో అరణ్య ఎకో పార్క్ రెడీ...ఇవాళ (జూన్ 18) వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం

నిజామాబాద్​, వెలుగు: ఫారెస్ట్​ ల్యాండ్​ రక్షణ, పచ్చదనం, పర్యావరణం పెంచడంతో పాటు ప్రజలకు అహ్లదకర వాతావరణం కల్పించడానికి అరణ్య ఎకో పార్క్​ రెడీ అయింది. నిజామాబాద్​ నగర శివారులోని మాక్లూర్​ మండలంలోగల   476.30 ఎకరాల ఫారెస్ట్​ ల్యాండ్​లో  డెవలప్​ చేసిన ఈ పార్క్​ను గురువారం సీఎం రేవంత్​రెడ్డి వనమహోత్సవం- 2026లో భాగంగా వర్చువల్​ మోడ్​లో ఓపెనింగ్​ చేయనున్నారు.

దీని కోసం జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ (డీఎఫ్​వో) సిద్ధార్థ విక్రమ్​ సింగ్​ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.   వర్చువల్​మోడ్​లో ఓపెనింగ్​ చేశాక పూర్తి స్థాయిలో అరణ్య అర్బన్​ పార్క్​ ప్రజలకు అందుబాటులోకి రానుంది.