బాన్సువాడ, వెలుగు: మాలలకు రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరిగేలా చూడాలని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామిని కోరారు. హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
రోస్టర్ పాయింట్ ను 15కు మార్చాలని, మాలలకు 8 శాతం రిజర్వేషన్ పెంచాలని, ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి కేబినేట్లో చర్చించాలని కోరారు. ఇందుకు మంత్రి వివేక్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మధు, నరేశ్, నిరుప్ తదితరులు పాల్గొన్నారు.
