జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు ఇవ్వరు.. ప్రశ్నిస్తే ఎండ్రిన్ తాగమంటారా? : కేటీఆర్

జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు ఇవ్వరు.. ప్రశ్నిస్తే ఎండ్రిన్ తాగమంటారా? : కేటీఆర్

రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వారి భవితను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కనీసం పది వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్ల కిందట జాబ్ క్యాలెండర్ అంటూ హడావుడి చేసిన సర్కార్, ఇప్పుడు ఉద్యోగాలు అడిగే యువతను చూసి ఎండ్రిన్ తాగండి అంటూ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవలం రాజకీయ లబ్దికోసమే యువతను వాడుకుంటున్నాయని విమర్శించారు.

►ALSO READ | స్వర్ణలత భవిష్యవాణి : ఆరు నెలల్లోపు విగ్రహ ప్రతిష్ఠ జరగాల్సిందే.. అడ్డొచ్చిన వారిని నలిపేస్తా..!

పిల్లల ఆందోళనను ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. నిరుద్యోగి వేణు రాసిన సూసైడ్ నోట్ పై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రే నిరుద్యోగులను ఉద్దేశించి చావండి అంటుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.