కోహ్లీని పట్టించుకోని పాండ్యా..వీడియో వైరల్

కోహ్లీని పట్టించుకోని పాండ్యా..వీడియో వైరల్

టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాల మధ్య విభేదాలున్నాయా...? వీరిద్దరు మాట్లాడుకోవడం లేదా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే ద్వారా వీరిద్దరి మధ్య విభేదాలున్నట్లు బహిర్గతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

గౌహతి వేదికగా భారత్ -శ్రీలంక మధ్య తొలి వన్డే జరిగింది.  ఈ మ్యాచ్‌లో టీమిండియా 67 పరుగుల భారీ తేడాతో లంకపై గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో  శ్రీలంక వికెట్ పడటంతో టీమిండియా ఆటగాళ్లు  సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా అందరితో షేక్ హ్యాండ్ ఇవ్వగా.. విరాట్ కోహ్లీని మాత్రం పట్టించుకోలేదు.  హార్దిక్ పాండ్యా తలపై టోపీని కూడా విరాట్ కోహ్లీ ముట్టుకున్నాడు. అయినా పాండ్యా చూడలేదు.  దీని తర్వాత కూడా హార్దిక్ పాండ్యాను కోహ్లీ కొంచెం చూడమని చెప్పినా.. హార్దిక్ పాండ్యా అతనిని పట్టించుకోలేదు. అతనితో మాట్లాడేందుకు విముఖత చూపాడు. ప్రస్తుతం ఈ వీడియోతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.