పేపర్ కప్స్‌‌లో టీ తాగుతున్నారా..? అయితే వెంటనే మానుకోవటం మంచిది

పేపర్ కప్స్‌‌లో టీ తాగుతున్నారా..? అయితే వెంటనే మానుకోవటం మంచిది

డిస్పోజబుల్ పేపర్ కప్స్‌‌లో టీ, కాఫీ తాగుతున్నారా…? అయితే వెంటనే మానుకోవటం మంచిది. వాటిలో టీ తాగటం  చాలా ప్రమాదకరం అంటున్నారు ఖరగ్‌‌పూర్‌‌ ఐఐటీ ఫ్రొఫెసర్లు. పేపర్ కప్పుల్లో వేడిగా ఉండే టీ, కాఫీలు పోయడం వల్ల ఆ కప్పుల్లోని ప్లాస్టిక్ పార్టికిల్స్ కరిగి డ్రింక్స్‌‌లో కలిసిపోతాయి. ఆ టీ తాగిన వాళ్ల బాడీలో చేరిపోతాయి.  కప్పులను వాటర్ ప్రూఫ్ చెయ్యటానికి వాడే వ్యాక్స్ పూత కూడా చాలా ప్రమాదకరం. పేపర్‌‌ కప్పుల్లో మూడుసార్లు 100మి.లీ చొప్పున టీ తాగితే 75వేల అతిసూక్ష్మ హానికర ప్లాస్టిక్‌‌ కణాలు  శరీరంలోకి వెళతాయి. అవి క్యాన్సర్‌‌‌‌కి దారితీయొచ్చని ఈ రీసెర్చ్ లో తేలింది.

రీసెర్చ్ కోసం100 మి.లీ వేడి నీళ్లని పేపర్ కప్పుల్లో పోశారు. 15 నిమిషాల తర్వాత మైక్రోస్కోప్ తో పరిశీలిస్తే 25 వేల మైక్రోప్లాస్టిక్‌‌లు నీళ్లలో కలిసినట్లు తేలింది. అంతే కాదు ఆ నీళ్లలో జింక్, క్రోమియం, సీసం వంటి హానికరమైన పార్టికల్స్ కూడా కనిపించాయి. వాటర్ ప్రూఫ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ పూతలో ఈ లోహాలు ఉంటాయట.  ఇవన్నీ చాయ్, కాఫీ లాంటి వేడి డ్రింక్స్‌‌తో పాటు తాగేవాళ్ల బాడీల్లోకి వెళ్లిపోతున్నాయి…  పేపర్‌‌ కప్పులను తయారుచేసేటప్పుడు గట్టిదనం కోసం వాటికి పాలీఇథిలిన్‌‌ ప్లాస్టిక్‌‌తో తయారైన హైడ్రోఫోబిక్‌‌ కోటింగ్‌‌ వేస్తారు. కప్పులో 85–-90 డిగ్రీ సెల్సియస్‌‌ వేడి ఉన్న టీ లేదా మరేదైనా ద్రవపదార్థం కానీ పోసినప్పుడు ఆ వేడికి మైక్రోఫోబిక్‌‌ ప్లాస్టిక్స్ కరిగిపోతాయి. వాటిని తాగినప్పుడు ఆ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. .  100మి.లీ లిక్విడ్ ద్వారా దాదాపు 25వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌‌ పార్టికిల్స్ మనలోకి చేరతాయట. పేపర్ కప్పుల్ని హైడ్రోఫోబిక్‌‌ ఫిల్మ్‌‌ను సన్నటి పొరగా వేసి తయారు చేస్తారు.  ఇందులోనూ పాలీ ఇథిలీన్‌‌… అంటే ప్లాస్టిక్‌‌ ఉంటుంది. ‘వేడి పదార్థాలు  పోసిన పావుగంట లోపే ఈ మైక్రోప్లాస్టిక్‌‌ లేయర్‌‌లో రియాక్షన్ మొదలవుతుంది’ అని ఈ స్టడీని లీడ్ చేసిన  అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌ సుధా గోయెల్‌‌ చెప్పారు.