
జ్యూరిచ్: ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ నెగ్గినా.. అర్జెంటీనా ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌ను సొంతం చేసుకోలేకపోయింది. గురువారం రిలీజ్ చేసిన తాజా జాబితాలో బ్రెజిల్ (1840 పాయింట్లు) టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, మెస్సీసేన (1838) రెండో ర్యాంక్‌కు పరిమితమైంది. ఫ్రాన్స్ (1823) మూడో ర్యాంక్‌లో నిలవగా, రెండు స్థానాలు దిగజారిన బెల్జియం (1781) నాలుగో ర్యాంక్‌కు పడింది. ఇంగ్లండ్ (1774), నెదర్లాండ్స్ (1740) వరుసగా ఐదు, ఆరు ర్యాంక్‌ల్లో ఉన్నాయి.
సూపర్ పెర్ఫామెన్స్‌తో దుమ్మురేపిన క్రొయేషియా (1727) ఐదు ప్లేస్‌లు ఎగబాకి ఏడో ర్యాంక్‌ను సాధించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాలేకపోయిన యూరోపియన్ చాంపియన్ ఇటలీ (1723), పోర్చుగల్ (1702), స్పెయిన్ (1692) వరుసగా 8, 9, 10వ ర్యాంక్‌ల్లో ఉన్నాయి. సెమీస్ వరకు వచ్చిన మొరాకో (1672) 11 ప్లేస్‌లు ఎగబాకి 11వ ర్యాంక్‌ను దక్కించుకుంది.