హౌడీ మోడీకి అంతా రెడీ

హౌడీ మోడీకి అంతా రెడీ
  • స్వాగతించేందుకు హూస్టన్‌‌లో ఘనంగా ఏర్పాట్లు
  • ఎన్​ఆర్​జీ స్టేడియం ముందు కార్లతో ర్యాలీ
  • భారీ సంఖ్యలో హాజరుకానున్న ఇండియన్లు
  • నేడు 3 గంటల పాటు కొనసాగనున్న సభ

హూస్టన్:

ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు హూస్టన్​లోని ఇండియన్​ అమెరికన్లు సిద్ధమయ్యారు. ‘హౌడీ, మోడీ’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు వందల మంది వాలంటీర్లు రాత్రింబవళ్లు కష్టపడి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆదివారం జరగనున్న ఈ సభకు ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​కూడా హాజరుకానున్నారు. దీంతో ఈ కార్యక్రమంపై అంచనాలు పెరిగిపోయాయి. మన సంతతికి చెందిన సిటిజన్లు పెద్ద సంఖ్యలో వస్తారని నిర్వాహకులు చెప్పారు. గతంలో పోప్​వచ్చినప్పుడు మినహా మరే ఇతర ఫారెన్​ లీడర్​ సభకూ రానంత జనం ఈ సభకు హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు.

సుమారు 50 వేల మంది అతిథులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎక్కడా ఎలాంటి తడబాటులేకుండా సభ సాఫీగా జరిగిపోయేలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు టెక్సాస్​ ఇండియా ఫోరం(టీఐఎఫ్) ప్రతినిధులు చెప్పారు. సభకు హాజరయ్యే జనాలను గైడ్​ చేయడానికి 15 వందల మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం 6 గంటల నుంచే స్టేడియం గేట్లు తీసి, జనాలను లోపలికి అనుమతిస్తామన్నారు. ప్రధాని మోడీని స్వాగతించాక స్టేడియం పరిసరాల్లో 200 కార్లతో ర్యాలీ తీయనున్నట్లు చెప్పారు. ‘నమో అగైన్​’ టీషర్టులతో, నినాదాలతో మోడీ అభిమానులు ఈ సభలో సందడి చేయనున్నారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఇండియన్​ అంబాసిడర్​హార్ష వి.ష్రింగ్లా పర్యవేక్షించారు. ఇప్పటికే అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హూస్టన్​లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మూడు గంటలపాటు జరిగే ఈ సభలో పాల్గొని, తర్వాత న్యూయార్క్​ బయలుదేరి వెళతారు.

సభ విశేషాలు..

  • టెక్సాస్​ ఇండియా ఫోరం సహా 600 సంస్థల సహకారంతో సభ.
  • సభకు హాజరయ్యేందుకు 50 రాష్ట్రాల నుంచి 50 వేల మంది రిజిస్టర్​ చేసుకున్నారు.
  • సభలో ఏర్పాట్ల కోసం 1500 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు.
  • ఉదయం 9 లోగా అంతా తమతమ సీట్లలోకి చేరేలా ఏర్పాట్లు.
  • 10:30 వరకు 400 మంది ఆర్టిస్టులతో సాంస్కృతిక కార్యక్రమాలు.
  • మోడీ, ట్రంప్​ల ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లిష్, స్పానిష్​భాషల్లోకి అనువాదం.
  • మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగనున్న సభ.

ఎన్‌‌ఆర్‌‌‌‌జీ స్టేడియం

‘హౌడీ మోడీ’ కార్యక్రమం జరిగే ఎన్‌‌ఆర్‌‌‌‌జీ స్టేడియంను గతంలో రిలియాంట్‌‌ స్టేడియం అని పిలిచేవారు. హూస్టన్‌‌లోని ఈ స్టేడియంలో చాలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సుమారు 71,995 మంది సీటింగ్‌‌ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో ఫుట్‌‌బాల్‌‌, సాకర్‌‌‌‌ మ్యాచ్‌‌లు కూడా జరుగుతాయి. ‘హౌడీ మోడీ’ కార్యక్రమానికి ఇప్పటికే దాదాపు 50వేల మంది రిజిస్టర్‌‌‌‌ చేసుకున్నారు. పోప్‌‌ కాకుండా అమెరికా వెళ్లిన వేరే దేశం నాయకుడు కోసం ఇంత పెద్ద సభ పెట్టడం ఇదే మొదటిసారి.

ట్రేడ్‌‌ టెన్షన్‌‌పై చర్చించే చాన్స్‌‌

మోడీ అమెరికా టూర్‌‌‌‌ సందర్భంగా ట్రంప్‌‌, మోడీ మధ్య ‘ట్రేడ్‌‌ డీల్‌‌’కు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రొడక్టులపై ఇండియా భారీగా టారిఫ్‌‌ విధిస్తోందని, ఇది ఎంత మాత్రం ఆమోదం కాదని ట్రంప్‌‌ గతంలో కామెంట్‌‌ చేశారు. తర్వాత జనరలైజ్డ్‌‌ సిస్టమ్‌‌ ప్రిఫరెన్స్‌‌ (జీఎస్పీ) ప్రోగ్రామ్‌‌ కింద లాభం పొందుతున్న, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియాకు ఉన్న గుర్తింపును రద్దు చేశారు. దీంతో ఇండియా 28 అమెరికా ప్రొడక్టులపై టారిఫ్‌‌లను పెంచింది.

హౌడీ అంటే ఏంటో తెలుసా?

టెక్సాస్‌ ఇంగ్లీష్‌ మాండలికంలో ‘హౌడీ’ అంటే ‘ హౌడు యు డు?’ అని అర్థం.. అంటే  మీరెలా ఉన్నారని… పలకరింపు అన్నమాట.

Arrangements have been made to preside over Howdy Modi flagship program