జంతువుల కోసం కజిరంగా నేషనల్ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

జంతువుల కోసం కజిరంగా నేషనల్ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

కాలానికి తగ్గట్టుగా జంతువులను సంరక్షిస్తోన్న అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ లో శీతాకాలం సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. చలికాలంలో జంతువులు, పక్షులను సురక్షితంగా ఉంచడానికి సమీపంలోని బోర్జురి గ్రామంలోని వన్యప్రాణుల పునరావాస & సంరక్షణ కేంద్రం వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగా పక్షుల కోసం ప్రత్యేకంగా ఐసీయులను నిర్మించారు. ఏనుగుల కోసం దుప్పట్లు లాంటి సౌకర్యాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏనుగుల కోసం బేస్ గా కింద చల్లగా ఉండకుండా తాము సాధారణంగా ఎండుగడ్డిని లేదా కప్పడానికి దుప్పట్లను ఉపయోగిస్తామని కాజిరంగా నేషనల్ పార్క్ లోని పశువైద్యుడు డాక్టర్ సంషుల్ అలీ తెలిపారు. పక్షులు, సరీసృపాల కోసం ICU లు ఏర్పాటు చేశామన్న ఆయన... వాటి వల్ల వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రతను నియంత్రించగలమని చెప్పారు. దాంతో పాటు తమ వద్ద 6 ఏనుగులు, 2 ఖడ్గమృగాలు, 1 గేదె, 5 చిరుతలు, 2 హార్న్‌బిల్స్ ఉన్నాయని స్పష్టం చేశారు.