వాటర్ మిలాన్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రం

వాటర్ మిలాన్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రం

వాటర్ మిలాన్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రాన్ని వేశారు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కళాకారుడు అనిల్. కేవలం 20 నిమిషాల్లోనే పుచ్చకాయపై వివేక్ ముఖ చిత్రాన్ని వేసి ఔరా అనిపించారు అనిల్. వివేక్  చిత్రం వేసిన పుచ్చకాయను స్థానిక కాంగ్రెస్ నేతలకు అందించారు అనిల్. అనిల్ గతంలో కూడా దేవుళ్ల ఫోటోలతో పాటు క్రీడాకారులు, సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలను వాటర్ మిలాన్ లపై  గీశారు .

తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్‌ వెంకటస్వామికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అల్వాల్‌కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రదీప్‌ అనే సూక్ష్మ కళాకారుడు ఆవగింజలపై మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేరును చిత్రీకరించాడు. అగ్గిపుల్లపై ఆవగింజలు పెట్టి వాటిపై జీ వివేక్‌ వెంకటస్వామి అని రాశాడు. ఆవగింజలపై మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేరు చిత్రీకరించడంపై ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు.

►ALSO READ | వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి.. 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ లీడర్

జూన్ 8న రాజ్ భవన్ లో వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే..ఆయనతో  పాటు మరో ఇద్దరు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. వివేక్ కు మైనింగ్ శాఖతో పాటు కార్మిక శాఖను కేటాయించి ప్రభుత్వం.