వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి.. 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ లీడర్

వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి.. 101 కొబ్బరికాయలు కొట్టిన కాంగ్రెస్ లీడర్

కోల్ బెల్ట్:  మంత్రి  వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మైనింగ్, లేబర్ మినిస్టర్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ లోని జగదాంబేశ్వర ఆలయం లో  కాంగ్రెస్ లీడర్, అఖిలభారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించారు.  

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి కుటుంబం 40 ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతం ప్రజలకు సేవలు చేస్తుందన్నారు.   బడుగు బలహీనవర్గాల కోసం పనిచేసిన కాకా ఫ్యామిలీ నుంచి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి అసలైన గౌరవంగా తాము భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా  మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఆలయంలో నూతన బోర్ వెల్ ను ఆయన ప్రారంభించారు.

►ALSO READ | వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ : మంత్రి సీత