మేడారం జాతర సాక్షిగా.. ఫిబ్రవరి 27 నుంచి ఫ్రీ కరెంట్..రూ. 500కే గ్యాస్

మేడారం జాతర సాక్షిగా.. ఫిబ్రవరి 27 నుంచి ఫ్రీ కరెంట్..రూ. 500కే గ్యాస్

ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా  భక్తులు వస్తే ఈ పండుగను  జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు.

ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు.  సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమయంలో  ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని  మాట ప్రకారం జాతర కోసం  రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని తెలిపారు.