కేటీఆర్ ఫారిన్ వెళ్లగానే.. బీఆర్ఎస్ ఎల్పీ చీలిక: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ ఫారిన్ వెళ్లగానే.. బీఆర్ఎస్ ఎల్పీ చీలిక: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ చీలిక దిశగా అడుగులు వేస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోవడం పక్కా అన్నారు. బీఆర్ఎస్ లో నాలుగు స్తంభాలాట నడుస్తోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావు, కవితకు మద్దతు గా ఉంటున్నారని చెప్పారు. 

శనివారం (మే 17) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజ తోత్సవాల సందర్భంగా కూడా హరీశ్ రావు, కవితకు ప్రాధాన్యం దక్కలేదని అన్నారు. కవిత ఒంటరయ్యారని అన్నారు. రాజకీయంగా కవితను అణిచివేసేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మహిళా సాధికారతలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫమైందని కవిత మాట్లాడటం వ్యూహాత్మ కమని అన్నారు. 

►ALSO READ | మంత్రి శ్రీధర్ బాబుకు బిగ్ రిలీఫ్.. కాళేశ్వరం భూసేకరణకు సంబంధించిన కేసు కొట్టివేత

త్వరలోనే కేసీఆర్ కు కవిత లేఖ రాయనుందన్నారు. పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్ కేనా అని ప్రశ్నించనుందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఒత్తిడి మేరకే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టారని తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్ హరీశ్ రావు ఇంటికి వెళ్తున్నారని, ఆయనను బతిమాలుతున్నా రని చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ అధ్యక్ష పదవి రెండూ తనకే కావాలని కేటీఆర్ అడుగుతున్నారని అన్నారు.