మంత్రి శ్రీధర్ బాబుకు బిగ్ రిలీఫ్.. కాళేశ్వరం భూసేకరణకు సంబంధించిన కేసు కొట్టివేత

మంత్రి శ్రీధర్ బాబుకు బిగ్ రిలీఫ్.. కాళేశ్వరం భూసేకరణకు సంబంధించిన కేసు కొట్టివేత

హైదరాబాద్: నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో మంత్రి శ్రీధర్ బాబుకు భారీ ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ అంశంలో శ్రీధర్ బాబుపై నమోదైన నాన్ బెయిలబుల్ కేసును కోర్టు కొట్టివేసింది. శ్రీధర్ బాబుతో పాటు మరో 13 మందిపై నమోదైన కేసును కూడా న్యాయస్థానం కొట్టివేసింది. కాగా, కాలేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని 2017, ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్‎లో శ్రీధర్ బాబుపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 300 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాదాపు 8 సంవత్సరాలు నడిచిన ఈ కేసును.. సరైన ఆధారాలు, సాక్షాలు లేకపోవడంతో శనివారం (మే 17) నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టి వేసింది.

కేసు కొట్టివేత సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రజా విజయమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల తరుఫున పోరాడామని.. అక్రమంగా భూములు గుంజుకుంటున్నారని ఫైట్ చేశామని గుర్తు చేశారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. మాపై పెట్టిన అక్రమ కేసులను తాజాగా కోర్టు కొట్టివేసిందన్నారు.

►ALSO READ | స్వయం సహాయక సంఘాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్