తెలుగు నటుడి రెండో పెళ్లి.. 60 ఏళ్ల వయస్సులో ఫ్యాషన్ డిజైనర్ తో

తెలుగు నటుడి రెండో పెళ్లి.. 60 ఏళ్ల వయస్సులో ఫ్యాషన్ డిజైనర్ తో


ఆశిష్ విద్యార్థి అనగానే ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు.. అదే మహేష్ బాబు పోకిరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ అనగానే.. అతనా అంటారు.. తెలుగు సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో ఎంతో గుర్తింపు పొందిన ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో.. అస్సాంకు చెందిన రూపాలి అనే ఫ్యాషన్ డిజైనర్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆశిష్ విద్యార్థికి ఇది రెండో పెళ్లి.. రూపాలి విషయం మాత్రం బయటకు రాలేదు. కోల్ కతాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఆశిష్ విద్యార్థి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీ ఇలా 11 భాష‌ల్లో 300 సినిమాల్లో నటించారు. ‘పాపే నా ప్రాణం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.  విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షలకు గుర్తుండిపోయారు. ఆశిష్ విద్యార్థి సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మహేష్ బాబు మూవీ పోకిరి. ఆ తర్వాత తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారు. 

ఆశిష్ విద్యార్థికి గతంలోనే పెళ్లి అయ్యింది. బెంగాల్ కు చెందిన నటి శకుంతల బారువాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. మే 25వ తేదీ గురువారం కోల్ కతాలో రూపాలిని రెండో వివాహం చేసుకున్నారు ఆశిష్ విద్యార్థి. రూపాలి ఫ్యాషన్ స్టోర్ నిర్వహిస్తుంది. విషయం తెలిసిన సినీ అభిమానులు, ఆప్తులు శుభాకాంక్షలు చెబుతున్నారు.