ఆర్టీసీ కార్మికులను థామస్ రెడ్డి మోసం చేస్తున్నారు

ఆర్టీసీ కార్మికులను థామస్ రెడ్డి మోసం చేస్తున్నారు

ఆర్టీసీ కార్మికులను థామస్ రెడ్డి మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి. థామస్ రెడ్డి కార్మికుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. కార్మికుల దగ్గరికి వెళ్లి ఓటింగ్ నిర్వహించి ఎవరు ప్రధాన కార్శదర్శిగా ఉండాలో తేల్చుకుందామన్నారు అశ్వత్థామ రెడ్డి.  తన ఆస్తులపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో..ఆర్టీసీ సమ్మెలో థామస్ రెడ్డిపై పోలీసు కేసు ఒక్కటైన బుక్ అయ్యిందా..? అని ప్రశ్నించారు.

అధికార కాంక్షతో మభ్యపెట్టి కవితక్క వస్తుందని మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ పెద్దలు ఆ యూనియన్ వెంట ఉండదలచుకున్నారా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.. డివిజన్ లలో నాపై పూర్తి నమ్మకం ఉంచారన్నారు. థామస్ రెడ్డి కార్మికుల నుంచి డబ్బులు తీసుకున్నారని తెలిపారు. ఫిబ్రవరి 7న కేంద్ర కమిటీ సమావేశం తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న అశ్వత్థామ రెడ్డి..ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకై కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. యూనియన్ పేరు వాడుకున్న థామస్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.