వార్నర్ను 11 సార్లు ఔట్ చేసిన అశ్విన్

వార్నర్ను 11 సార్లు ఔట్ చేసిన అశ్విన్

నాగ్పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆసీస్  పై132 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (37/5)స్పిన్ మ్యాజిక్ చేయడంతో మూడు రోజుల్లోనే  టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ ను ఓడించింది.  అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాట్స్మెన్  డేవిడ్  వార్నర్ను మరోసారి ఔట్ చేసిన అశ్విన్  .. ఇప్పటివరకు టెస్టుల్లో అతన్ని 11సార్లు పెవిలియన్కు పంపించాడు. దీంతో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ సరసన అశ్విన్  చేరాడు. బెన్ స్టోక్స్ కూడా వార్నర్ ను 11సార్లు ఔట్ చేశాడు.  ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 14 సార్లు వార్నర్ను పెవిలియన్కు  పంపి టాప్ ప్లేస్లో ఉన్నాడు. 

 మరోవైపు ఈ మ్యాచ్లో ఓడిపోయి ఆస్ట్రేలియా పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. భారత్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఏ ఒక్క ఆసీస్  బ్యాట్స్ మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం ఇదే తొలిసారి. అలాగే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి 10 మంది ఆసీస్  ఆటగాళ్లు ఎల్బీగా వెనుదిరగడం కూడా ఇదే తొలిసారి.  టెస్టుల్లో ఆసీస్కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 1981లో మెల్‌బోర్న్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 83  పరుగులకే ఆలౌట్ అయింది. కాగా టెస్టుల్లో ఆసీస్  పై  ఇన్నింగ్స్‌ తేడాతో భారత్ గెలవడం ఇది ఐదోసారి.