అది ఒక కల.. అజాజ్ పటేల్ పై అశ్విన్ ప్రశంసలు

అది ఒక కల.. అజాజ్ పటేల్ పై  అశ్విన్ ప్రశంసలు

ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన  న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పై  ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు క్రికెటర్లు. భారత క్రికెటర్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇన్నింగ్స్ తర్వాత అతనికి వాంఖడే స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. పలువురు భారత అభిమానులు కూడా నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇదే వీడియోలో అశ్విన్ కూడా నిలుచుని చప్పట్లు కొడుతుండగా.. చివరిలో అజాజ్ బంతితో అభివాదం చేశాడు. అంతేగాకుండా అశ్విన్  తన కూ యాప్ లో కూడా అజాజ్ పటేల్ పై ప్రశంసలు కురిపించాడు అశ్విన్. ఒకే ఇన్నింగ్స్ లో  10 వికెట్లు తీయడమనేది ఒక కల అని.. క్లబ్ లో చేరినందుకు వెల్డన్ అంటూ పోస్ట్ చేశాడు.