హిందీలో మాట్లాడనందుకు భారతీయురాలివేనా అన్నారు!!

హిందీలో మాట్లాడనందుకు భారతీయురాలివేనా అన్నారు!!

డీఎంకే సీనియర్ లీడర్ కనిమొళి
చెన్నై: మీరు భారతీయులేనా అని ఎయిర్‌‌పోర్ట్‌లో తనను ఓ సీఐఎస్‌ఎఫ్​ ఆఫీసర్ అడిగారని డీఎంకే పార్టీ నేత కనిమొళి అన్నారు. ఎయిర్‌‌పోర్ట్‌లో హిందీలో మాట్లాడనందుకు తనను ఇండియనేనా కాదా అని అడిగారన్నారు. తనకు హిందీ రాదని వివరిస్తున్న టైమ్‌లో ఇలా ప్రశ్నించారని ఆమె చెప్పారు. తనతో తమిళం లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడాలని సదరు ఆఫీసర్‌‌తో చెప్పానని, దానికి సమాధానంగా ఒకవేళ మీరు భారతీయులైతే అని అడిగారని పేర్కొన్నారు. ఈ విషయంపై కనిమొళి ట్విట్టర్‌‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘ఇవ్వాళ ఎయిర్‌‌పోర్ట్‌లో ఒక సీఐఎస్‌ఎఫ్‌ ఆఫీసర్ నన్ను ‘ఒకవేళ నేను భారతీయురాలివైతే’ అన్నారు. నాకు హిందీ రాదు కాబట్టి నాతో తమిళ్ లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడమని ఆమెతో చెప్పా. నేనొకటి అడగాలనుకుంటున్నా.. అసలు ఎప్పటినుంచి ఇండియన్‌ అనేది హిందీ తెలిసుండటానికి సమానమైంది’ అని కనిమొళి ట్వీట్ చేశారు.