గ్యాస్ బావి లీకేజీ పై హైలెవల్ దర్యాప్తు

గ్యాస్ బావి లీకేజీ పై హైలెవల్ దర్యాప్తు

మంటలు అదుపులోకి వచ్చేందుకు 3 వారాలు పడుతుందన్న అస్సాం సీఎం

గౌహతి : అస్సాం లోని టాక్సికియా జిల్లా బాగేజన్ గ్యాస్ బావిలో చేలరేగిన మంటల ఘటనపై అస్సాం సీఎం శర్వానంద్ సోనోవాల్ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. గ్యాస్ లీకేజీ కి కారణమెంటో పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. గత నెల 27 న బాగేజన్ గ్యాస్ బావిలో మొదలైన మంటలు మరింత వ్యాప్తి చెందుతున్నాయి. పరిస్థితి అదుపుతప్పిందని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా తో పాటు కేంద్ర, రాష్ట్ర ఫైర్ ఫైటర్స్ కృషి చేస్తున్నారన్నారు. కనీసం మరో 3 వారాలు అయితే గానీ మంటలు అదుపులోకి రావని చెప్పారు. ఎప్పటి కప్పుడు పరిస్థితిని సోనేవాల్ రివ్యూ చేస్తున్నారు. ప్రధాని మోడీ కి కూడా సహాయ చర్యలు, మంటలను ఆర్పేందుకు చేపట్టిన చర్యలను వివరించినట్లు గురువారం సోనేవాల్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులందరినీ ఆదుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.

Assam CM Sarbananda Sonowal orders high-level probe into OIL's Baghjan well tragedy