హిందూ పురాణాల ప్రకారం ఆషాడ పౌర్ణమి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజును గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈ ఏడాది జులై 29న వచ్చింది. ఆ రోజున మహాభారతాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడి జన్మదినం అని పండితులు చెబుతున్నారు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే.. ఉద్యోగంలో ఉన్న బాధలకు మంచి పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే చదువుకొనే వారు.. నిరుద్యోగులు కూడా ఇలా చేస్తే కచ్చితంగా అనుకున్న ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.
వేద పంచాంగం ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి జూలై 28వ తేదీ సాయంత్రం 6:18 గంటలకు ప్రారంభమై, జూలై 29వ తేదీ బుధవారం రాత్రి 8:05 గంటలకు ముగుస్తుంది.అందుకే 2026లో ఆషాఢ పౌర్ణమిని జూలై 29వ తేదీ బుధవారం నాడు జరుపుకుంటారు. దీనిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆ రోజున దేశవ్యాప్తంగా గురు పూజ, దేవాలయాలలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, చంద్రుడికి నైవేద్యాలు సమర్పిస్తారు.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గురు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతితో పాటు ఉద్యోగంలో ఉన్న కష్టాలకు విముక్తి కలగడమే కాకుండా.. చదువుకొనే విద్యార్థులు.. నిరుద్యోగులు ఈ పనులు చేస్తే అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ALSO READ : ఆధ్యాత్మికం: చాతుర్మాసం ప్రారంభం.. నాలుగు నెలలు ఏదేవుడిని పూజించాలి..
తెలుపు రంగు వస్తువులు దానం : ఆషాఢ పౌర్ణమి రోజున తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. ఇది జాతకంలో చంద్రుడిని బలపరుస్తుంది. ఇలా చేయడం వలన ఉద్యోగంలో ఉన్న కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
చదువుకునే పిల్లలు : ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటారు.ఆ రోజున పుస్తకాలు, పెన్సిళ్లు లేదా ఇతర విద్యాభ్యాసన సామగ్రి దానం చేయాలి. అలా చేయడం వలన జ్ఞానం , ఆలోచించే విధానం మొదలైన విషయాలలో మెరుగ్గా ఉండేందుకు శక్తి కలుగుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
వస్త్రదానం: ఆషాఢ పౌర్ణమి రోజున పేదలకు కొత్త లేదా శుభ్రమైన బట్టలు దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో , సమాజంలో గౌరవం కూడా పెరగడమే కాకుండా.. సానుకూల శక్తి లభిస్తుంచి ఆర్థిక కష్టాలకు మంచి పరిష్కారం లభిస్తుంది.
ఇష్టమైన వస్తువులు: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఎవరికి వారు వారికి ఇష్టమైన వస్తువులను పేద పిల్లలకు దానం చేయడం వలన ఆనందం ... సంతోషం కలుగుతుంది.
అన్నదానం : ఏది దానం చేసినా తృప్తి ఉండదు.. అదే ఆహారం దానం చేస్తే తృప్తి కలుగుతుంది అంటారు. అందుకే ఆషాఢ పౌర్ణమి రోజున ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లేదా ఆహార పదార్థాలను దానం చేయడం చాలా మంచిది. అన్న సంతర్పణ నిర్వహించడం చాలా మంచిది. ఆహార దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభించి, జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
