ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల ఔట్‌డోర్ ట్రెయినింగ్‌కు ఏఎఫ్‌ఐ అనుమతి
న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా గదులకు పరిమితమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లకు.. అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. పాటియాలలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్‌ఐఎస్) , బెంగళూరు, ఊటీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సెంటర్లలో ఉన్న అథ్లెట్లు సోమవారం నుంచి ఔట్‌డోర్ ట్రెయినింగ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. అథ్లెట్లు గాయాల బారిన పడకుండా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలనే ఈ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. కరోనా ముప్పు పొంచి ఉండడంతో అథ్లెట్లు ట్రెయినింగ్ సమయంలో ఫిజికల్ డిస్టెన్స్ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని సూచించింది. అథ్లెట్లు సొంత సామాగ్రిని వెంట తెచ్చుకోవాలని, ఇతరుల స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్‌ను ముట్టుకోవద్దని ఆదేశాల్లో పేర్కొంది.
ఆరోగ్య సమస్యలున్న వారు స్వయంగా ట్రెయినింగ్‌కు దూరంగా ఉండాలని కోరింది. ‘పాటియాల, బెంగళూరు, ఊటీలో ఉంటున్న అథ్లెట్లు సోమవారం నుంచి ఔట్‌డోర్ ఫిట్‌నెస్ ట్రెయినింగ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఫిట్‌నెస్ ట్రెయినింగ్ మాత్రమే. ఎనిమిది వారాలుగా అథ్లెట్లందరూ గదులకే పరిమితమయ్యారు. వారు ఫిట్‌నెస్ ప్రమాణాలు అందుకున్న తర్వాత ఈవెంట్ బేస్డ్ ట్రెయినింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు’ అని ఏఎఫ్‌ఐ ప్రెసిడెంట్ అదిల్లే సుమరివాలా చెప్పారు. ఏఎఫ్‌ఐ ప్రకటన పట్ల స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఆలస్యమైనా ఏదో ఒకటి ఇప్పటికైనా మొదలవుతుంది, చాలా ఆనందంగా ఉంది’ అని నీరజ్ పేర్కొన్నాడు.
For More News..
ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు
కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు


