- ఖాతాదారుల సొమ్ము నొక్కేస్తున్న ముఠా
మేడిపల్లి, వెలుగు: ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వాళ్లను దొంగలు బురిడీ కొట్టిస్తున్నారు. డబ్బులు బయటకు వచ్చే దారిలో (స్లాట్) ప్లాస్టిక్ షీట్లను అడ్డుగా పెట్టి ఖాతాదారుల సొమ్మును కాజేస్తున్నారు. దొంగలు ముందుగానే ఏటీఎం మెషీన్ దగ్గరికి వచ్చి, డబ్బులు బయటకు వచ్చే చోట ఒక ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెడుతున్నారు.
ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు డ్రా చేసినప్పుడు.. మెషీన్ లోపల కౌంటింగ్ జరుగుతుంది కానీ, ఆ ప్లాస్టిక్ అడ్డంకి వల్ల డబ్బులు బయటకు రావు. మెషీన్ రిపేర్ అనుకుని మనం వెళ్లిపోగానే, దొంగలు వచ్చి ఆ షీట్ తీసి మన డబ్బులు పట్టుకెళ్తున్నారు. మేడిపల్లి ఐసీఐసీఐ ఏటీఎంలో ఈ నెల 7న ఇలాగే రూ. 500 కాజేశారు. మళ్లీ 15వ తేదీన అదే ఏటీఎంలో ప్లాస్టిక్ షీట్ పెడుతుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

