మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై లోక్ సభలో చాలా హాట్ గా డిస్కషన్ నడుస్తుంది. అందరూ సీరియస్ చర్చల్లో ఉండగా.. రాహుల్ గాంధీ ప్రసంగం కొద్దిసేపు నవ్వులు పూయించింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. భారతదేశంలో.. జాతీయ శక్తిలో మహిళలు కేంద్ర శక్తిగా ఉన్నారని.. వాళ్ల నుంచి ఈ సమాజం.. నేను ఎంతో నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చారు. మహిళల నుంచి ఈ సమాజం.. దేశం ఎంతో నేర్చుకున్నదన్నారు.
మహిళలు తల్లులుగా.. అక్కగా.. చెల్లిగా.. భార్యగా కుటుంబంలో.. సమాజంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. దేశ నిర్మాణంలో.. కుటుంబ నిర్మాణంలో మహిళల పాత్రను ఎవరూ విస్మరించలేరన్నారు.
ఇలా మాట్లాడుతూనే.. ప్రధాని మోడీ, నాకు భార్య సమస్య లేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సభలో నవ్వులే నవ్వులు. మిగతా అందరి సమస్యలు మాకు తెలుసు.. వారి నుంచి విన్నాం.. ప్రధాని మోడీకి, నాకు భార్య లేకపోవటం వల్ల మాకు భార్య సమస్యలు తెలియవు అంటూ నవ్వించారు రాహుల్ గాంధీ. మాకు భార్య నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు అందవు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.
నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని.., నిన్న ఒక్క రోజే నా సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ సాధించారు. అదేంటి అంటే అమిత్ షాను నవ్వించటం అంటూ సభలో సరదాగా వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.

