హైదరాబాద్ సిటీలో పాన్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో.. పాన్ షాపుల్లో విక్రయించే వస్తువుల నాణ్యతను పరిశీలిస్తున్నారు పోలీసులు. 2026, ఏప్రిల్ 18వ తేదీ ఉదయం నుంచి ఓల్డ్ సిటీలోని పాన్ షాపుల్లో అమ్మే సిగరెట్లు, పాన్ మసాలాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించారు. బ్రాండెడ్ వాటినే అమ్ముతున్నారా.. కల్తీ వాటిని అమ్ముతున్నారా అనే విషయాలతో.. పాన్ షాపుల్లో అమ్మే వస్తువుల ఎక్స్ పయిరీ డేట్స్ తనిఖీ చేశారు పోలీసులు.
రాష్ట్రంలో బ్యాన్ అయిన పాన్ మసాలాలు, గుట్కాలు వంటివి ఎవరైనా అమ్ముతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. కొన్ని పాన్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. లోకల్ వస్తువులకు బ్రాండెడ్ ముద్ర వేసి అమ్ముతున్న కొన్నింటిని.. అదే విధంగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వాటినే అమ్మాలని.. బ్యాన్ చేసిన వాటిని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్ హిల్స్ లోని ఓ పాన్ షాపులో ఈ సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

