V6 News

మద్యం మత్తులో ఏటీఎంపై దాడి.. జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో నిందితుడు 

మద్యం మత్తులో ఏటీఎంపై దాడి.. జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో నిందితుడు 

జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్​లోకి దూరి మెషీన్​ను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్​కు చెందిన వేణు నందు (43) మంగళవారం అర్ధరాత్రి జూబ్లీచెక్​పోస్ట్​సమీపలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్​లోకి కర్రతో ప్రవేశించాడు. అనంతరం ఏటీఎంపై దాడి చేయగా, అలారంతో అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. తక్షణమే రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఫుట్​పాత్‌పై నివసించే వేణు నందు.. మద్యం మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.