మందు తాగొద్దన్నందుకు కత్తితో దాడి.. గండిపేటలో ఘటన

మందు తాగొద్దన్నందుకు కత్తితో దాడి.. గండిపేటలో ఘటన
  •     వీపులో ఇరుక్కుపోయిన కత్తి 

గండిపేట, వెలుగు: మందు తాగవద్దని మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి కత్తితో వీపులో గుచ్చి పరారయ్యాడు. వెస్ట్​బెంగాల్‌‌‌‌ ప్రాంతానికి చెందిన లోక్మాన్‌‌‌‌ ఆలీ(30) అక్బర్​హిల్స్‌‌‌‌లో ఉంటూ మెహరబ్‌‌‌‌ హోటల్లో పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రోషన్‌‌‌‌(30) ఎప్పుడూ మద్యం తాగి న్యూసెన్స్​చేస్తూ ఉంటాడు. దీంతో ఆలీ అతడికి మందు తాగొద్దని చెప్తూ ఉండేవాడు.

 ‘నువ్వు మందు తాగకపోతే మంచి వ్యక్తివి.. తాగడం వల్ల చెడ్డవాడివి అయిపోతున్నావ్.. అని మంచిమాటలు చెప్పాడు. ఇదే విషయమై ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను ఎప్పుడూ తాగొద్దని చెప్తున్నాడని కోపంతో రోషన్.. ఆలీని చాకుతో వీపు భాగంలో పొడిచాడు. వీపుపై కత్తి దింపి తిప్పడంతో అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా లోక్మాన్‌‌‌‌ ఆలీని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు అత్తాపూర్‌‌‌‌ సీఐ నాగేశ్వర్​రావు తెలిపారు.