ఖోఖో ప్లేయర్ పై రేప్..హత్య.. సాయం కోసం ఏడ్చిన ఆడియో క్లిప్ వైరల్

V6 Velugu Posted on Sep 14, 2021

24 ఏండ్ల యువతి.. నేషనల్‌ ఖో ఖో ప్లేయర్.. జాబ్ ఇంటర్వ్యూ నుంచి  తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు రేప్‌ చేసి ఆమె చున్నీతోనే ఉరి బిగించి  రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయాడు. మొఖం గుర్తు పట్టకుండా దారుణంగా హింసించాడు. నోట్లో పళ్లు లేకుండా రాలగొట్టాడు. క్రూరంగా చంపి రైలు పట్టాలపై పడేసి  పరారయ్యాడు. ఆమె ఫోన్ తీసుకుని వెళ్లాడు. సెప్టెంబరు 10న  యూపీలోని బిజ్నోర్ లో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. మొదట పోలీసులు మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫ్రెండ్‌ ఫోన్‌ కాల్.. నిందితుడిని పట్టించిన యువతి ఫోన్‌

ఈ ఘటన జరిగిన సమయంలో ఆమె ఫోన్‌లో మాట్లాడుతోంది. అది గమనించని నిందితుడు ఆమెపై అటాక్ చేశాడు. ఆ రాక్షసుడు అకృత్యానికి పాల్పడిన సమయంలోనూ ఫ్రెండ్ తో ఫోన్‌ కాల్ కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసిన తీరు కలిచి వేస్తోంది. ఒక నిమిషం 41 సెకన్ల పాటు రికార్డ్ అయింది. ఈ ఆడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశాడు ఆమె ఫ్రెండ్. దీని సాయంతో ఆమె ఫోన్ కోసం పోలీసులు కేసు ఛేదించారు. ఘటన సమయంలో మిస్‌ అయిన ఆమె ఫోన్‌.. ట్రేస్ చేయాలన్న ఆలోచన వచ్చింది. దీంతో నిందితుడు షాజద్‌ అలియాస్ హమీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అతడు ఒక రైల్వే లేబర్ అని, డ్రగ్‌ అడిక్ట్ అని, ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. క్రైమ్‌ స్పాట్‌లో అతడి షర్ట్ బటన్ దొరికిందన్నారు. అలాగే అతడి షర్ట్‌పైనా రక్తపు మరకలు ఉంటే నిందితుడి భార్య ఉతికేసిందన్నారు. అయితే నిందితుడిని పరిశీలించగా అతడి శరీరంపై బాధితురాలు ఆ నిస్సహాయ స్థితిలో గోళ్లతో రక్కి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆనవాళ్లు గుర్తించామని, దీంతో ఆ శాంపిల్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా అది బాధితురాలి డీఎన్‌ఏతో మ్యాచ్‌ అయిందని చెప్పారు. 

Tagged HELP, viral, Bijnor, Audio clip, UP Kho Kho player screaming, crying

Latest Videos

Subscribe Now

More News