- అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి
- ఘనంగా జేఎన్టీయూ 14వ స్నాతకోత్సం
కూకట్పల్లి, వెలుగు: ఆధునిక సాంకేతిక విద్యను విద్యార్థులతో పాటు విద్యా సంస్థలు కూడా నిరంతరం అందిపుచ్చుకోవాలని అరబిందో ఫార్మా లిమిటెడ్ హైదరాబాద్ హోల్‌టైమ్ డైరెక్టర్ మెట్టు మదన్‌మోహన్‌రెడ్డి సూచించారు. జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏఐ, ఎనేబుల్డ్ డిస్కవరీ, ప్రిడిక్టివ్ జెనోమిక్స్, అడ్వాన్స్డ్ బయోలాజికల్స్, జీన్ థెరపీ, డిజిటల్ పేమెంట్స్, ఓకో సిస్టమ్స్ వంటి రంగాల్లో సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనికి అనుగుణంగా జేఎన్టీయూ తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని అభినందించారు.
వీసీ డాక్టర్ టి. కిషన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 82,547 మంది యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీలు అందిస్తున్నామని, ఇందులో 87 డాక్టోరల్ డిగ్రీలు, 71 గోల్డ్ మెడల్స్ ఉన్నాయని తెలిపారు. ఏఐ, మిషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ వంటి రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆర్25 కరికులమ్ అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు, రెక్టార్ డాక్టర్ కె. విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
