V6 News

అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి అందించాలి: మోడీ

అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి అందించాలి: మోడీ

అరబిందో భావజాలాన్ని కొత్త తరానికి తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అరబిందో 150వ జయంతి సందర్భంగా స్మారక నాణెం, తపాలా స్టాంపును మోడీ విడుదల చేశారు. అరబిందో జయంతి యావత్ జాతికి ఒక చారిత్రాత్మక సందర్భమని ఆయన తెలిపారు. అరబిందో జయంతిని ప్రత్యేకంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

అరబిందో జీవితం ‘ఏక్ భారత్..శ్రేష్ట భారత్’కు ప్రతిబింబమని ప్రధాని మోడీ అన్నారు. అరబిందో బెంగాల్ లో జన్మించినప్పటికీ.. ఎక్కువ కాలం గుజరాత్, పుదుచ్చేరిలలో గడిపాడని గుర్తు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వ్యక్తిత్వంపై లోతైన ముద్ర వేశారని మోడీ చెప్పారు.