V6 News

థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లోనూ ఇంగ్లండ్​ చిత్తు

థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లోనూ ఇంగ్లండ్​ చిత్తు

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: బౌలింగ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ షో చూపెట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌‌‌‌ థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌ విక్టరీ సాధించింది. పేసర్‌‌‌‌ స్కాట్‌‌‌‌ బోలాండ్‌‌‌‌ (4–1–7–6) డెబ్యూ మ్యాచ్‌‌‌‌లోనే ఆరు వికెట్లతో రికార్డు క్రియేట్‌‌‌‌ చేయడంతో.. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ 14 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరో రెండు మిగిలి ఉండగానే 3–0తో రిటెయిన్‌‌‌‌ చేసుకుంది. 31/4 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో మంగళవారం, థర్డ్‌‌‌‌ డే ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 27.4 ఓవర్లలో 68 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ జో రూట్‌‌‌‌ (28) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌.   ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ బోలాండ్‌‌‌‌తో పాటు  స్టార్క్‌‌‌‌ (2/54), కమిన్స్‌‌‌‌ (3/36) ఇంగ్లండ్‌‌‌‌ను దెబ్బకొట్టారు.