ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో భారత్ ఓటమి..3-1తో సిరీస్ కైవసం

ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో భారత్ ఓటమి..3-1తో సిరీస్ కైవసం


ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. నాల్గో మ్యాచ్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 189 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన..20 ఓవర్లలో  5 వికెట్లకు 181 పరుగులే చేసింది. ఈ విజయంతో  ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది. 

మందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు..20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ 30 పరుగులు చేసింది. బెత్ మూనీ, తహ్లియా మెక్ గ్రాత్ విఫలమయ్యారు. ఆ తర్వాత ఆష్లే గార్డెనర్ 42 పరుగులు చేయగా..ఎల్లీస్ పెర్రీ హాఫ్ సెంచరీతో చెలరేగింది. కేవలం 42 బంతుల్లో 72 పరుగులు సాధించింది. ఆమెకు గ్రేస్ హర్రిస్ 12 బంతుల్లో 27 రన్స్ కొట్టింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు, రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. 

189 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేసింది. ఓపెనర్లు స్మృతీ మందానా 16 పరుగులు, షఫాలీ వర్మ 20 పరుగులే చేశారు. అయితే కెప్టెన్ క్ష హర్మన్ ప్రతీత్ కౌర్ 46 పరుగులతో , దేవిక వైద్య 32 పరుగులతో రాణించారు. చివర్లో రీచా ఘోష్ 26 బంతుల్లో 40 పరుగులు, దీప్తి శర్మ 8 బంతుల్లో 12 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.  ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డెనర్, అలానా కింగ్ చెరో రెండు వికెట్లు దక్కించుకోగా...డార్సీ బ్రౌన్ ఒక వికెట్ పడగొట్టింది.