
భారత్తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఈజీగా ఛేజ్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66*), ట్రావిస్ హెడ్ (51*) అర్ధశతకాలు సాధించి జట్టును గెలిపించారు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ సమం చేసింది. చివరిదైన మూడో వన్డే మార్చి 22న జరగనుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్‌గా కాగా.. అక్షర్ పటేల్ (29*), రవీంద్ర జడేజా (16), రోహిత్ శర్మ (13) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కాకుండా అబాట్ 3, ఎల్లిస్ 2 వికెట్లు తీశారు.