V6 News

పుష్ప సాంగ్ కు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్

పుష్ప సాంగ్ కు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్

కొద్దిరోజులుగా  సోషల్ మీడియాలో  హల్చల్  చేస్తున్న  ఆసీస్  క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరోసారి తనదైన  స్టైల్లో  ఆకట్టుకున్నాడు. గతంలో  బుట్టబొమ్మ సాంగ్ కి  భార్యతో  కలిసి స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.  ఆ తర్వాత  చాలా తెలుగు పాటలకు  డ్యాన్స్ వేశాడు  వార్నర్. ఇప్పుడు  పుష్ప సినిమాలోని..  యే బిడ్డా.. ఇది  నా అడ్డా.. సాంగ్ కు  డ్యాన్స్ చేశాడు. దీనికి  ఓ  క్యాప్షన్ పెట్టండి అంటూ ..ఇన్ స్టా గ్రామ్ లో  పోస్ట్ చేశాడు వార్నర్.  దీనికి  స్పందించిన  అల్లు అర్జున్.. మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేలే..  అంటూ కామెంట్ చేశాడు.