ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్ లో నడాల్‌.. బార్టీ, కీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆస్ట్రేలియా ఓపెన్: సెమీస్ లో నడాల్‌.. బార్టీ, కీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: కెరీర్‌‌‌‌‌‌‌‌లో 21వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ వేటలో ఉన్న స్పెయిన్‌‌‌‌‌‌‌‌ బుల్‌‌‌‌‌‌‌‌ రఫెల్‌‌‌‌‌‌‌‌ నడాల్‌‌‌‌‌‌‌‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఏడోసారి సెమీస్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో ఆరోసీడ్‌‌‌‌‌‌‌‌ నడాల్‌‌‌‌‌‌‌‌ 6–3, 6–4, 4–6, 3–6, 6–3తో 14వ సీడ్‌‌‌‌‌‌‌‌ డెనిస్‌‌‌‌‌‌‌‌ షపొపలోవ్‌‌‌‌‌‌‌‌ (కెనడా)పై గెలిచాడు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తొలి రెండున్నర సెట్లు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ డామినేట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత కడుపునొప్పి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఐదోసెట్‌‌‌‌‌‌‌‌కు ముందు  లభించిన ఏడు నిమిషాల బ్రేక్‌‌‌‌‌‌‌‌లో రికవర్‌‌‌‌‌‌‌‌ అయిన నడాల్‌‌‌‌‌‌‌‌ డిసైడర్‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపాడు. సెకండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌లో షపొపలోవ్‌‌‌‌‌‌‌‌ సర్వ్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి 2–0 లీడ్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. వెంటనే తన సర్వ్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకుని లీడ్‌‌‌‌‌‌‌‌ను 3–0కు పెంచుకున్నాడు.

చివరి వరకు దానిని కంటిన్యూ చేసి సెట్‌‌‌‌‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో షపొపలోవ్‌‌‌‌‌‌‌‌ 20 ఏస్‌‌‌‌‌‌‌‌లు, 5 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌, 51 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌... నడాల్‌‌‌‌‌‌‌‌ 8 ఏస్‌‌‌‌‌‌‌‌లు,  11 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌, 28 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్ చేశాడు. మరో మ్యాచ్‌‌‌‌లో ఏడో సీడ్‌‌ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 3–6, 3–6, 6–2తో  17వ సీడ్‌‌ గైల్‌‌ మోన్‌‌ఫిల్స్‌‌ (ఫ్రాన్స్‌‌)ను ఓడించి సెమీస్‌‌లో నడాల్‌‌తో పోటీకి రెడీ అయ్యాడు.ప్రస్తుతం నడాల్‌‌‌‌‌‌‌‌ 20 గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌తో ఫెడరర్‌‌‌‌‌‌‌‌, జొకోవిచ్‌‌‌‌‌‌‌‌తో సమంగా ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో నడాల్‌‌‌‌‌‌‌‌ గత రికార్డు బాగాలేదు. . కేవలం 2009లో మాత్రమే విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన స్పెయిన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌.. లాస్ట్‌‌‌‌‌‌‌‌ 13 క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో ఏడుసార్లు ఓడాడు. ఈ సారి మాత్రం టైటిల్​కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. 
బార్టీ ఈజీగా..
విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో యాష్లే బార్టీ ఈజీగా సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరింది. క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ బార్టీ (ఆస్ట్రేలియా) 6–2, 6–0తో జెస్సీకా పెగులా (అమెరికా)ను ఓడించింది. గంటా 3 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ల్లో రాణించింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌ క్రెజికోవా (చెక్​)కు షాక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. మాడిసన్‌‌‌‌‌‌‌‌ కీస్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–3, 6–2తో క్రెజికోవాను ఓడించింది.
సానియా జోడీ ఔట్​
ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ సానియా మీర్జా–రాజీవ్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) జోడీ.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో సానియా–రాజీవ్‌‌‌‌‌‌‌‌ 4–6, 6–7తో ఆసీస్‌‌‌‌‌‌‌‌ జంట ఫౌరిలిస్‌‌‌‌‌‌‌‌–కుబ్లేర్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. గంటా 30 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండో–అమెరికన్‌‌‌‌‌‌‌‌ జోడీ సత్తా మేరకు రాణించలేకపోయింది. దాంతో, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ తర్వాత కెరీర్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పనున్న సానియా.. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ సెకండ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలవాలన్న కోరికను నెరవేర్చుకోలేకపోయింది.