చిన్నారి పెళ్లిని అడ్డుకున్న అధికారులు

చిన్నారి పెళ్లిని అడ్డుకున్న అధికారులు

కొమురవెల్లి, వెలుగు: ఓ బాలిక వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాంసాగర్ లో శనివారం జరిగింది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల ఐసీడీఎస్ సీడీపీవో రమాదేవికి రాంసాగర్ లో బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారంతో అధికారులు అక్కడి చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు, గ్రామ పెద్దలకు బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించి అవగాహన కల్పించారు. సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్ ఆదిలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లీగల్ ఆఫీసర్ ఆరీఫ్, చైల్డ్ లైన్ సిబ్బంది మధు మౌనిక, గ్రామ సర్పంచ్ రవీందర్ పాల్గొన్నారు.